తెలంగాణలో రైతులు ఏడుస్తుంటే.. ఢిల్లీలో BRS పండగ: మాజీ MP పొన్నం

రోడ్డున పడ్డ కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​పేర్కొన్నారు.

Update: 2023-05-06 14:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రోడ్డున పడ్డ కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ సరైన తీరులో లేనందున రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రాలకు ధాన్యం వచ్చినా.. తీసుకోవట్లేదన్నారు. రైతులు ఏడుస్తుంటే. ఢిల్లీలో బీఆర్ఎస్ ​పండగ చేసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నదని, కాంగ్రెస్​పార్టీ తప్పకుండా ఆదుకుంటుందన్నారు.

మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్​ఇంటికో ఉద్యోగమంటూ.. మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ.. కర్ణాటక ప్రచారం పూర్తి చేసుకొని ఈ నెల 8న తేదిన ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా ప్రియాంక పర్యటనకు మద్ధతు తెలపాలని కోరారు. మాజీ ఎంపీ సురేష్ సటక్కర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ కుటుంబం అంతా బంగార మయం అయిందన్నారు.

Also Read:

బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

Tags:    

Similar News