కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ రెడ్డి కూతురు మృతి...

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ రెడ్డి కుమార్తె ముత్యాల సమన్వి (16) గురువారం రాత్రి మృతి చెందింది.

Update: 2023-10-13 05:54 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ రెడ్డి కుమార్తె ముత్యాల సమన్వి (16) గురువారం రాత్రి మృతి చెందింది. ముత్యాల సునీల్ రెడ్డి ఇంట్లో ఆయన కూతురు సమన్వి బాత్రూంలో జారిపడి తలకు గాయమై మృతి చెందింది. కాగా శుక్రవారం బాల్కొండ నియోజకవర్గం లోని మెండోరా మండలంలోని సావెల్ గ్రామంలో మృతి చెందిన సమన్వి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గల కాంగ్రెస్ ముఖ్య నాయకులు సావెల్లో నిర్వహించే సమన్వి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.


Similar News