పదేళ్లల్లో కేసీఆర్ మోసాలకు అదుపులేదు: మల్లు రవి

పదేళ్లలో కేసీఆర్ చేయని మోసాలు లేవని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి నుంచి దళితబంధు వరకు అన్ని మోసపూరిత మాటలేనని గురువారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Update: 2023-06-01 13:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్లలో కేసీఆర్ చేయని మోసాలు లేవని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి నుంచి దళితబంధు వరకు అన్ని మోసపూరిత మాటలేనని గురువారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్​ఆటలకు ఇక చెక్ పడినట్టేనని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నొక్కి చెప్పారు. ఇక తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ, 6 దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ, తల్లి సోనియమ్మ నెరవేర్చారని మల్లు రవి గుర్తు చేశారు.

ఈ మేరకు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేయబోతున్న కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేసారని, మోసపు మాటలతో, మభ్యపెట్టే పథకాలతో గద్దెనెక్కిన కేసీఆర్.. ప్రజలను అవసరాలను విస్మయానికి గురిచేశాడన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం అంటూ అనేక పథకాల హామీలన్నీ గాలికి కలసిపోయానని విమర్శించారు.

Also Read..

దశాబ్ది ఉత్సవాలు కలిసి వచ్చేదెవరికి? బెడిసికొట్టేదెవరికి? 

Tags:    

Similar News