‘కాంగ్రెస్ పాకిస్తాన్‌పై యుద్ధం చేసింది.. బీజేపీ ఆ దేశ ప్రధానిని పిలిచి మరీ దావత్ ఇచ్చింది’
ప్రధాని నరేంద్ర మోడీపై పీసీసీ అధికార ప్రతినిధి ఎం.భవాని రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ కుల పెద్దకు ఎక్కువ.. మత గురువుకు తక్కువ అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై పీసీసీ అధికార ప్రతినిధి ఎం.భవాని రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ కుల పెద్దకు ఎక్కువ.. మత గురువుకు తక్కువ అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీని పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు నరేంద్ర మోడీ నోటి నుంచి వస్తాయని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి దిగజారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని తెలిపారు. 1965లో పాకిస్తాన్ మీద కాంగ్రెస్ యుద్ధం చేసిందని గుర్తుచేశారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను విడదీసింది కాంగ్రెస్ అని అన్నారు. స్వయంగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ముషారఫ్‌ని పిలిచి ఆతిథ్యం ఇచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కింది స్థాయి నుంచి పైకి వచ్చారని తెలిపారు. ప్రధాని విధానపరమైన అంశాలపై మాట్లాడితే బాగుంటదని అన్నారు. దేశానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు మోడీని ప్రజలు ప్రధానిగా చూశారు.. కానీ, ఈసారి ఫలితం అలా ఉండదని అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్ నుండి కనయాకుమారి, మణిపూర్ నుంచి ముంబై వరకు న్యాయ యాత్ర రాహుల్ గాంధీ చేశారని అన్నారు.