రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడు: ఎంపీ ఈటల రాజేందర్

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేర్చేందుకు సోమవారం గైడ్ లైన్స్ విడుదల చేసింది.

Update: 2024-07-16 09:56 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేర్చేందుకు సోమవారం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం.. రైతులు తీసుకున్న లోన్, వడ్డీతో కలిపి రూ. 2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుంది. దీనిపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయడం లేదని.. మండిపడ్డారు. అలాగే సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ రైతులకు ఉరితాడులా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు రూ. 2 లక్షల రుణమాఫీ, ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి 6 పేజీల నిబంధనలు రూపొందించిందని ఫైర్ అయ్యారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల్లో కిసాన్, యువ, దళిత పోలీసులు ప్రకటించిందని.. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదని.. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఈటల విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News