హైదరాబాద్లో మరో జూపార్క్ .. అధికారులకు కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది..
దిశ, వెబ్ డెస్క్: విశ్వనగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా భాగ్యనగరంలో బెస్ట్ పాలసీలను అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. స్పీడ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో తాజాగా సమీక్ష నిర్వహించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న మంచి పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతంలో మరో జూపార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.