Congress: కాంగ్రెస్ పార్టీ నుంచి బక్క జడ్సన్ బహిష్కరణ.. సోషల్ మీడియాలో ఆయన సంచలన ట్వీట్ వైరల్

లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ నియమ నిబంధనలు అతిక్రమించిన నేతలపై కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది.

Update: 2024-04-02 15:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ నియమ నిబంధనలు అతిక్రమించిన నేతలపై కాంగ్రెస్ రాష్ట్ర అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మంగళవారం ఆదేశాలను జారీ చేశారు. బహిరంగ వేదికలపై పార్టీ పరిధిని దాటి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో జడ్సన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బక్క జడ్సన్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘1989 నుంచి కాంగ్రెస్ పార్టీలో మీ మద్దతుకు ధన్యవాదాలు @INC india,@రాహుల్ గాంధీ, @ప్రియాంక గాంధీ. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను తినే తోడేలుకు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ బాధ్యతలను అప్పజెప్పింది. ఎట్లకేలకు నన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సరైన గుర్తింపునిచ్చారు’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తు్న్న ఆ ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News