బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీన్దర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

Update: 2024-09-18 16:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీన్దర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ధర్నాలు, దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాలు నిర్వహించింది. ఒక జాతీయ పార్టీ నేత, ప్రధాన ప్రతిపక్ష లీడర్ ను బీజేపీ నాయకుడు బెదిరించారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ప్రధాని, హోంమంత్రి స్పందించకపోవడం దారుణమని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్ లో బీజేపీ అగ్రనేతల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. డీసీసీలు, ఎన్ ఎస్ యూఐ, యూత్, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు చేశారు. గాంధీభవన్ ముందు ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, చల్లా నర్సింహారెడ్డి, తదితరులు ఆందోళనలు చేపట్టారు. హన్మకొండ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసనలు నిర్వహించి బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Similar News