కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై వీడని సందిగ్ధం.. ప్రచారానికి దూరమైన నాయకులు
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా మొదటి విడత
కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపుపై పీఠమూడి కొనసాగుతూనే ఉంది. రేపోమాపో అంటూ అభ్యర్థుల ఖరారును అధిష్టానం ఆలస్యం చేస్తుండడంతో నాయకుల్లో.. ప్రధానంగా క్యాడర్ లో నైరాశ్యం నెలకొంది. అధికార పార్టీ నెల రోజుల క్రితమే ప్రచారంలో బరిలో ఉండగా బీజేపీ సైతం పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసి పోటీలో దింపింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఊపులో గెలువాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభ్యర్థుల ఖరారు వ్యవహారం తలనొప్పిగా మారింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా మొదటి విడతలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. రెండవ విడతలో నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఎల్లారెడ్డి టికెట్లు ఖరారు చేశారు. ప్రస్తుతానికి కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్(ఎస్సీ రిజర్వుడ్)నియోజకవర్గాలకు కామారెడ్డి జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేయలేదు. నిజామాబాద్ జిల్లాలో అర్బన్ నియోజకవర్గానికి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. సీఎం కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీలో బరిలో ఉండడంతో అక్కడ ఎవరు పోటీ చేయాలని సందిగ్ధత కొనసాగుతుంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా మొదటి విడతలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. రెండవ విడతలో నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఎల్లారెడ్డి టికెట్లు ఖరారు చేశారు. ప్రస్తుతానికి కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్(ఎస్సీ రిజర్వుడ్)నియోజకవర్గాలకు కామారెడ్డి జిల్లాలో అభ్యర్థులను ఖరారు చేయలేదు. నిజామాబాద్ జిల్లాలో అర్బన్ నియోజకవర్గానికి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. సీఎం కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీలో బరిలో ఉండడంతో అక్కడ ఎవరు పోటీ చేయాలని సందిగ్ధత కొనసాగుతుంది. మొన్నటి వరకు అక్కడ షబ్బీర్ ఆలీ పోటీ చేస్తారని ఆయన ప్రచార క్షేత్రంలో దిగారు. రెండవ విడత టికెట్ల కేటాయింపు సమయంలో మాత్రం అక్కడ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండాల్సిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ కు లేదా ఎల్లారెడ్డికి పంపిస్తారని ప్రచారం జరిగింది. రెండవ విడతలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మధన్ మోహన్ రావును ఎంపిక చేయడంతో షబ్బీర్ ఆలీకి నిజామాబాద్ అర్బన్ కు పంపుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే నిజామాబాద్ అర్బన్ తో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు వ్యవహారాన్ని అధిష్టానం ఆచితూచిగా ఎంపికకు వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీలో ఆలస్యానికి కారణమైంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్ లో ప్రచారం సరళి ఊపందుకోలేదు. అక్కడ టికెట్లు ఆశిస్తున్న వారు ఎవరికి వారు ప్రచారం చేస్తుండడంతో కాంగ్రెస్ క్యాడర్ లో అయోమయం నెలకొంది.
12 మంది దరఖాస్తు..
ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం అయిన నిజామాబాద్ అర్బన్ లో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, పార్టి వర్కింగ్ ప్రేసిడెంట్ తో పాటు మొత్తంగా 12 మంది దరఖాస్తు చేసుకోగా కొత్తగా ఆకుల లలిత కాంగ్రెస్ పార్టిలో చేరి టికెట్ అశీస్తున్నారు. ఇక్కడ సర్వేలతో పాటు అర్థిక బలం, కుల బలం, సామాజీక బలా బలాలను అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఇటివల నిర్వహించిన సర్వేలలో మాజీ మంత్రి షబ్బిర్ ఆలీకి టికేట్ కేటాయిస్తే ఎలా ఉండబోతుందని జరిపిన సర్వేలలో అనుకులంగా రాలేదని ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రినే స్థానికేతరుడు అని ముద్ర వేస్తున్నారని ఈ నేపథ్యంలో కోరుట్లకు చెందిన మైనార్టి వ్యాపారీ పేరు కుడా తెరుమరుగైంది. ఇప్పటికే నిర్వహించిన సర్వేలతో పాటు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల వద్ద సత్తా ఉన్నవాళ్లకే టికెట్ల ఖాయం అని అది కుడా నామినేషన్ లకు ముందే ఇస్తారని ప్రచారం మొదలైంది. కామారెడ్డి నియోజకవర్గంలో మొన్నటి వరకు ప్రచారం చేసిన మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ హైద్రాబాద్ కు పరిమితమయ్యారు. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బరిలో ఉంటారా? లేదా; అనే అంశంపై కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.
సర్వేలపై యోచిస్తున్న అధిష్టానం
బాన్సువాడలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులకంటే పార్టిలో చేరిన, చెరనున్న నాయకులకు టికేట్ ఇస్తే ఎలా ఉంటుందని సర్వేలతో పాటు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలిసింది. జుక్కల్ నియోజకవర్గంలో ముగ్గురు నేతల మధ్య టికేట్ కేటాయింపు పార్టికి కోత్త తలనప్పులు తప్పవని అలోచిస్తున్నట్లు సమాచారం. అక్కడ టికెట్ల కేటాయింపు తరువాత పార్టిలో గోడవలతో పాటు రెబల్ గా పోటి చేస్తామని , లోకల్ నాన్ లోకల్ అనే ఫిలింగ్ ఇప్పుడు అక్కడ టికేట్ కేటాయింపు విషయంలో పార్టి అచి తూచిగా అడుగులు వెస్తుంది. ఐతే ప్రతిపక్షాలు నియోజకవర్గాలు చూట్టేస్తుంటే తమ నాయకులకు టికేట్ రాకపోతే తమ పరిస్థితి ఎమిటని నియోజకవర్గంలో ద్వితియ శ్రేణి నాయకుల్లో నైరాశ్యం నెలకోంది. అధికార పార్టి, బీజేపీ లు కాంగ్రెస్ క్యాడర్ ను లాక్కునే పనిలో పడితే అక్కడ నియోజకవర్గ లీడర్లు టికెట్ వేటలో ఉన్నారు. నెల రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీలో అభ్యర్థులు ప్రచారానికి రాకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పోటిలో ఉంటుందా అని ప్రచారం మొదలైంది