మంత్రి కేటీఆర్‌కు షాక్.. మరోసారి ఈసీకి కంప్లైంట్ చేసిన కాంగ్రెస్

మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కేటీఆర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాల్లో ఇంటర్వ్యూలు, న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది.

Update: 2023-11-21 10:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కేటీఆర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాల్లో ఇంటర్వ్యూలు, న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ కారణం వల్ల మూడు రోజుల పాటు కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా ఇటీవల టీ హబ్‌లో యువకులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు వార్త పత్రికల్లో పబ్లిష్ అయ్యాయి. ప్రభుత్వ భవనమైన టీహబ్‌లో యువతతో కేటీఆర్ సమావేశం నిర్వహించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార హోదాను దుర్వినియోగం చేశారని అందువల్ల కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలివ్వాలని కోరారు.

Tags:    

Similar News