డబ్బులు పోతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయండి.. ‘సైబర్’ బాధితులకు డబ్బు రికవరీ..
ఇటీవల సైబర్ వలలో చిక్కి భారీగా నగదు పోగొట్టుకున్న ఇద్దరు బాధితులకు సైబర్ క్రైమ్ పోలీసులు వారికి డబ్బులు రికవరీ చేయించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల సైబర్ వలలో చిక్కి భారీగా నగదు పోగొట్టుకున్న ఇద్దరు బాధితులకు సైబర్ క్రైమ్ పోలీసులు వారికి డబ్బులు రికవరీ చేయించారు. ఇద్దరు బాధితులకు మొత్తం రూ. 1,61,24,226 రూపాయలు సిటీ జాయింట్ సీపీ రంగనాథ్ వారికి అందజేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో నివాసముంటున్న భాదితుడు గుర్తు తెలియని వ్యక్తి తాయివాన్ నుంచి మీకు కొరియర్ వచ్చిందని నమ్మించి రూ. 98,79,000 డబ్బులు వసూలు చేశారు. తర్వాత మోసపోయాయని గ్రహించిన భాదితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టి.. బాధితుడి నుంచి డబ్బులు పడ్డ బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించారు.
మరో బాధితుడు ట్రెడింగ్ పేరుతో రూ. 1,04,8000 మోసపోయాడు. దీంతో అతను సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు జమ్మూ కాశ్మీర్, గుజరాత్‌లో ఉన్న బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. పోలీసులు విచారణ జరిపి కోర్టు ఆధ్వర్యంలో ఈ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి తిరిగి బాధితులకు డబ్బులు పోలీసులు చేయించగలిగారు. కాగా, 2023లో సైబర్ నేరాల్ భాదితులు రూ.140 కోట్ల వరకు నష్టపోగా, రూ. 44 కోట్లు ఫ్రీజ్ చేశామని, ఇందులో రూ. 2 కోట్ల లోపు బాధితులకు తిరిగి ఇవ్వగలిగామని తాజాగా సీపీ రంగనాథ్ తెలిపారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ట్రేడింగ్, కొరియర్ ఫ్రాడ్స్ పెరిగాయన్నారు. సైబర్ క్రైమ్ బాధితులు క్రైమ్ జరిగిన 1 నుంచి 2 గంటల్లోపు గోల్డెన్ అవర్స్.. డబ్బులు పోతే వెంటనే 1930కి ఫిర్యాదు చేస్తే డబ్బులు ఫ్రీజ్ చేస్తామని వెల్లడించారు.