గన్మెన్ ఉద్యోగం చేస్తూనే… 32 మందికి కోచింగ్…

ఓ ఉన్నతాధికారికి గన్మెన్‌గా ఉద్యోగం చేస్తూనే నిరుద్యోగులకు శిక్షణ అందించి 11 మంది కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందేలా ఉచిత శిక్షణ ఇచ్చాడు.

Update: 2024-02-15 15:36 GMT

దిశ, కామారెడ్డి: ఓ ఉన్నతాధికారికి గన్మెన్‌గా ఉద్యోగం చేస్తూనే నిరుద్యోగులకు శిక్షణ అందించి 11 మంది కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందేలా ఉచిత శిక్షణ ఇచ్చాడు. దీంతో కానిస్టేబుల్‌కు పలువురు అభినందనలు, ప్రశంసలు తెలుపుతున్నారు. 32 మందికి రెండు సంవత్సరాలు ఉచిత శిక్షణ ఇవ్వగా అందులో 11 మంది కానిస్టేబుల్లుగా ఎంపిక కావడంతో నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ ఉచిత శిక్షణ ఇచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అభినందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి చౌరస్తాకు చెందిన లకావత్ శ్రీనివాస్ కామారెడ్డి డీఎస్పీ గన్ మెన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు 32 మంది నిరుద్యోగులకు రెండు సంవత్సరాలు పాటు కానిస్టేబుల్ ఎంపిక కోసం ఉచిత శిక్షణ ఇచ్చాడు. ఇందులో శిక్షణ పొందిన వారు ఇటీవల పోలీస్ నియామకాల్లో 11 మంది సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు రెండేళ్లపాటు శ్రీనివాస్ ఫిజికల్ ఫిట్నెస్, ఇతర ఈవెంట్స్ శిక్షణ అందించారు. తాను శిక్షణ ఇచ్చి 32 మందిలో 11 మంది కానిస్టేబుల్ గా ఎంపిక కావడం ఆనందంగా ఉందని లకావత్ శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు.


Similar News