Revanth Reddy: స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-09-19 13:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ నిర్వహణ కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇవాళ సచివాలయంలో సీఎం ఆధ్వర్యంలో యూనివర్సిటీ బోర్డు సమావేశం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు, బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో-చైర్మన్ శ్రీనివాస సీ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాల్లో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మీటింగ్‌లో అధికారులు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను, ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు.

రేవంత్‌రెడ్డి విజనరీ : ఆనంద్ మహీంద్రా

సమావేశానికి హాజరైన వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన గొప్పదని ప్రశంసించారు. రేవంత్ విజన్ ఉన్న నాయకుడని, అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని ఆయన కోరగానే ఒప్పుకున్నానని తెలిపారు.


Similar News