Khammam floods : వరద బాధితుల కోసం అధికారులకు సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.

Update: 2024-09-03 14:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజులు ఖమ్మం వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు అండగా ఉంటామని పర్యటనలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పర్యటనకు సంబంధించిన ఓ వీడియో నెటిజన్లు, ప్రజలతో పంచుకున్నారు.

ప్రకృతి విధ్వంసంలో ప్రజా జీవనం అతలాకుతలం అయినప్పుడు ముఖ్యమంత్రి క్షేత్రానికి వస్తే ఒక భరోసా. వ్యవస్థలు పరుగులు పెట్టి పని చేస్తాయన్న నమ్మకం. ఇళ్లు వాకిళ్లు కోల్పోయిన బాధితులకు సహాయం దక్కుతుందన్న ఆశ.. ఆ నమ్మకం ఇవ్వడానికే తిరిగి జీవితం పట్ల ఆశ చిగురింప చేయడానికి రెండు రోజులు ప్రజల మధ్య గడిపాను. చివరి బాధితుడికి న్యాయం జరిగే వరకు ఆఖరి నిస్సహాయుడికి కూడా సాయం దక్కే వరకు అధికార యంత్రాంగం అవిశ్రాంతంగా పని చేయాలని, వరద బాధిత ప్రజలను ఆదుకోవాలి.. అని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ కోరారు. 


Similar News