కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం.. మరోసారి రెచ్చిపోయిన CM రేవంత్
తెలంగాణ బీజేపీ(BJP Telangana) అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి రెచ్చిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(BJP Telangana) అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి రెచ్చిపోయారు. శుక్రవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కిషన్ రెడ్డి(Kishan Reddy) మోడీ భజన చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం బిహార్, యూపీకి ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణకు ఇవ్వడంలేదని అన్నారు. కిషన్‌రెడ్డి వల్లే మెట్రో, మూసీ ఆగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రకే బినెట్‌లో పెట్టకుండా మిగతా మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి రావడం లేదు.. రూపాయి కడితే 42 పైసలు మాత్రమే వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వ(NDA Govt)మే ఉన్నది.. అక్కడ మైనార్టీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. బీసీ కులగణన(BC Caste Census) జరిగితే అధికారం పోతుందని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆరేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. ఏనాడైనా తెలంగాణ ప్రాజెక్ట్ కోసం ప్రధాని(PM Modi)ని కలిశారా? అని అడిగారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.