TS: ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.. గైడ్‌లైన్స్ విడుదల చేయాలని CM రేవంత్ ఆదేశం
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టడానికి ముహూర్తం ఖరారు చేసింది. శనివారం సంచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల పథకంపై వెంటనే గైడ్‌లైన్స్ రూపొందించాలని సూచించారు.
ఈ పథకం ద్వారా ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం అందించనున్నారు. కాగా, తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతోంది. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రెండు స్కీములు(ఫ్రీ బస్, రాజీవ్ ఆరోగ్య బీమా పెంపు) ప్రారంభించగా.. ఇటీవల మరో రెండు(గృహజ్యోతి, మహాలక్ష్మి) పథకాలను ప్రారంచింది. కాగా, ఆరు గ్యారంటీల అమలుకు ప్రజా పాలన పేరిట అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.