ఏపీ, తెలంగాణను ఒకేలా చూడండి.. కేంద్రమంత్రికి CM రేవంత్ రిక్వెస్ట్

వరద నష్టంపై కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్(Shivraj Singh Chauhan), బండి సంజయ్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది.

Update: 2024-09-06 12:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరద నష్టంపై కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్(Shivraj Singh Chauhan), బండి సంజయ్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. వరద, పంట నష్టంపై కేంద్రమంత్రికి సీఎం వివరించారు. ఒకేరోజు అత్యధికంగా 40 సెం.మీ వర్షం కురిసింది. వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తి దెబ్బతిన్నాయి. తీవ్ర పంట నష్టం జరిగిందని కేంద్రమంత్రికి వివరణ ఇచ్చారు. వరద నష్టం రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ సాయం అందించాలని కోరారు.


Similar News