Ganesh immersion : తొలి సీఎం ఆయనే.. సీఎం రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు

హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న లంబోదరుడి విగ్రహాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే గంగ ఒడికి చేరుతున్నాయి.

Update: 2024-09-17 10:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న లంబోదరుడి విగ్రహాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే గంగ ఒడికి చేరుతున్నాయి. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ ఆయా ప్రభుత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నాయి. అలాగే ట్యాంక్‌బండ్‌పై గణనాథుల నిమజ్జన ప్రక్రియను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రికార్డు సాధించారు. ఇది వరకు ఎవరూ చేయనటువంటి అసాధారణ రీతిలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ట్యాక్‌బండ్‌పై కాలినడకన స్వయంగా నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ కార్మికులు, క్రేన్ ఆపరేటర్స్‌తో సీఎం మాట్లాడారు. మరోవైపు తరలి వచ్చిన భక్తులతో సీఎం ముచ్చటించారు. ఈ సంఘటనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇలాంటి విధంగా ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదని, ప్రజల మనిషి అని కొనియాడారు. కాగా, గతంతో పోలిస్తే ఈ సారి గణపతి మండపాలు పెరిగాయి. దాదాపు లక్ష విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌కు తరలి వస్తాయని, గురువారం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు.


Similar News