ప్రధాని మోడీతో CM రేవంత్ భేటీ.. ముహూర్తం ఖరారు

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీకి ముహూర్తం ఖరారైంది.

Update: 2025-02-25 12:46 GMT
ప్రధాని మోడీతో CM రేవంత్ భేటీ.. ముహూర్తం ఖరారు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీకి ముహూర్తం ఖరారైంది. బుధవారం ఉదయం 10:30 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), సీఎస్ శాంతి కుమారి, సీఎంవో సెక్రటరీ శేషాద్రి, డీజీపీ జితేందర్‌తో కలిసి ప్రధానితో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్‌(Musi River Front)కు నిధులు, మెట్రో పొడిగింపు కోసం ఆర్థిక సహాయం, ఐపీఎస్ కేడర్ పెంపు ఇతర అంశాలపై ప్రధానికి మెమొరాండం ఇవ్వబోతున్నారు. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సైతం సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారని సమాచారం.

మరోవైపు.. ఈ రాత్రికే సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్ అధిష్టానం(Congress High Command) పెద్దలను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)తో పాటు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది. 

Tags:    

Similar News