CM Revanth Reddy: ఇవాళ సాయంత్రం కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాన కారణం అదే!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సాయంత్రం కేరళ (Kerala)కు వెళ్లనున్నారు.

Update: 2024-10-22 04:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సాయంత్రం కేరళ (Kerala)కు వెళ్లనున్నారు. వయనాడ్ (Wayanad) ఉప ఎన్నికల (By Elections) నేపథ్యంలో బుధవారం ఉదయం ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఎంపీగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) కూడా పాల్గొననున్నారు. అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) వయనాడ్‌ (Wayanad)తో సహా రాయ్‌బరేలీ (Raibareli) నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసి రెండు చోట్ల అఖండ విజయం సాధించారు. దీంతో ఆయన రాయ్‌బరేలీ (Raibareli) నుంచి ఎంపీగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వయనాడ్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

అయితే, వయనాడ్ (Wayanad) ఉప ఎన్నిక గెలుపును కాంగ్రెస్ (Congress) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానానికి కాపాడుకునే విషయంలో ఆ పార్టీ అగ్ర నాయకత్వం అక్కడి నుంచి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)ని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబానికి అక్కడ ఉన్న ఆదరణ, చరిష్మా ప్రియాంక గెలుపును మరింత సులువు చేస్తుందని కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు. 2019లో కాంగ్రెస్‌ కంచుకోటగా పేరున్న అమేథీలో రాహుల్‌ గాంధీ ఓడిపోయారు. అదే సమయంలో ఆయన వయనాడ్‌ నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మళ్లీ 2024 జరిగిన లోకసభ ఎన్నికల్లో అక్కడి ప్రజలు రాహుల్‌ గాంధీని ఎంపీ పీఠంపై కూర్చొబెట్టారు. అయితే, ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

వయనాడ్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతుండగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఈసారి ఎలాగైన వయనాడ్ (Wayanad) ఎంపీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కమలం పార్టీ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ప్రముఖ విద్యావంతురాలు నవ్య హరిదాస్‌ (Navya Haridas)‌ను పోటీలో నిలిపింది. ఇక ఉప ఎన్నికల్లో విజయం సాధించి పూర్వ వైభవం సాధించాలని వామపక్ష పార్టీ అయిన ఎల్‌డీఎఫ్ అప్పుడే ప్రచారాన్ని ముమ్మరం చేసింది.   

Tags:    

Similar News