ఈ నెల 17న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని గురువారం ఉదయం తెలంగాణకు చేరుకున్నారు.

Update: 2024-08-14 11:58 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని గురువారం ఉదయం తెలంగాణకు చేరుకున్నారు. అమెరికా, దక్షిణకొరియా పర్యటనలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు చేసుకుని మొత్తం రూ.31,532 కోట్ల పెట్టుబడులకు కుదిరిన ఒప్పందాలు కుదుర్చుకోగా.. వీటి ద్వారా 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. అయితే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. అలాగే రేపు ఆగస్టు 15 సందర్భంగా.. ఉదయం 8.30 గంటలకు గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌ జెండా ఆవిష్కరంచి.. 9.20 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌ చేరుకుని సైనికుల స్మారక స్థూపానికి నివాళి ఆర్పించనున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకుని.. జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఎగురవేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది. రెండు రోజుల క్రితం ఏఐసీసీ మీటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాగా సీఎం ఢిల్లీ పర్యటన పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Similar News