SLBC టన్నెల్ వద్దకు CM రేవంత్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) కూలి.. అందులో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Update: 2025-03-02 03:48 GMT
SLBC టన్నెల్ వద్దకు CM రేవంత్ రెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) కూలి.. అందులో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు టన్నెల్ ప్రమాదస్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Chief Secretary to the Govet Shanti Kumari)తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లనున్నారు. ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు.. టన్నెల్‌ ప్రమాదంలో 8 మంది చనిపోవడం అత్యంత విచారకరమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. రాడార్ ద్వారా మృతదేహాలు గుర్తించారని తెలిపారు. అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని.. రేపు మధ్యాహ్నానికల్లా మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని ఎమ్మెల్యే వంశీ కృష్ణ వెల్లడించారు.

Tags:    

Similar News