బాల్యాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్.. ఇంటర్‌లోనే ఆ ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డా!

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొత్తకోటలో రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షో లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వనపర్తిలో గడిపిన తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.

Update: 2024-05-04 14:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొత్తకోటలో రోడ్ షో నిర్వహించింది. ఈ రోడ్ షో లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వనపర్తిలో గడిపిన తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. వనపర్తిలో ప్రతి గల్లీ గల్లీ తెలుసన్నారు. తనకు పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు వనపర్తికి ఏడో తరగతి నుంచి చదివారని గుర్తుచేశారు. ఈ నలభై ఏళ్లు ఈ ప్రాంతం, విద్యార్థులు, ప్రజలతోని అభినాభావ సంబంధం ఉందని అన్నారు. తాను జిల్లా పరిషత్ హైస్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వనపర్తి లో చదువుకున్నారని వెల్లడించారు.

తన పదో తరగతి ఐపోయిన వెంటనే ఇంటర్‌లో ఉన్నప్పుడు అనాడు రాజీవ్ గాంధీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. ఆ ఎన్నికల్లో చిన్నారెడ్డిని గెలిపించాలని, అనాడు వనపర్తిలో ఉన్న గల్లీ గల్లీలో గోడల మీద కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.. చిన్నారెడ్డిని ఎమ్మెల్యేను చేయండి.. అని రాతలు రాసినట్లు గుర్తుచేశారు. నల్లమల అడవిలో మారుమూల కొండారెడ్డి పల్లిలో పుట్టిన నేను.. వనపర్తిలో చదివిన నేను.. కొత్తకోట ప్రాంతంలో పెరిగిన నేను.. అంటూ తన అన్న భూపాల్ రెడ్డి కొత్తకోటలో ఎన్నో ఏళ్లు పోలీస్ ఉద్యోగం చేశారని గుర్తుచేశారు.

Tags:    

Similar News