CM Revanth Reddy: కొత్త గవర్నర్ నియామకంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

కొత్త గవర్నర్ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

Update: 2024-07-28 06:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజల తరపున జిష్ణుదేవ్ వర్మను స్వాగతిస్తున్నానన్నారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందించారు. అన్ని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాలకు గవర్నర్లను శనివారం రాత్రి నియమించింది తెలంగాణ గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యకి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. అయితే ఇన్నాళ్లు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించిన జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణను కేంద్రం మహారాష్ట్రకు బదిలీ చేసింది.

కొత్త గవర్నర్ రేవంత్ కు సహకరించేనా?:

తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కొత్త గవర్నర్ కు రేవంత్ రెడ్డి సర్కార్ కు మధ్య సంబంధాలు కొనసాగుతాయా అనేదానిపై డిస్కషన్ సాగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య అస్సలు పొసిగేదికాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సెస్ తమిళిసై మధ్య అమితుమీ అన్నట్లుగా వ్యవహారం సాగింది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం అప్పటి వరకు గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందర రాజన్ స్థానంలో సీపీ రాధాకృష్ణన్ రావడంతో ప్రభుత్వానికి రాజ్ భవన్ సఖ్యతతోనే వ్యవహారాలు కొనసాగాయి. ఇప్పుడు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం కావడంతో పరిస్థితులు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. రాష్ట్రంలో నెలకొంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్ భవన్ కు రేవంత్ రెడ్డికి కొత్సంబంధాలే కొనసాగుతాయా లేక గత ప్రభుత్వలో మాదిరిగా రెండు రాజ్యాంగబద్ధమైన పోస్టుల మధ్య పొలిటికల్ వార్ సాగుతుందా అనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News