CM Revanth Reddy: ‘వాళ్ల వెన్నులో వణుకుపుట్టాలి.. సమాజానికి మనం ఇవ్వగలిగింది అదే’

ఇంతకుముందు మత్తుపదార్థాల కేసుల్లో ఎవరెవరో అరెస్టయ్యేవాళ్లని, కానీ ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇంజినీరింగ్ విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు పట్టుబడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-11-11 09:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంతకుముందు మత్తుపదార్థాల కేసుల్లో ఎవరెవరో అరెస్టయ్యేవాళ్లని, కానీ ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇంజినీరింగ్ విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు పట్టుబడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చదువును పక్కన పెట్టి మత్తుపదార్థాలు సేవిస్తూ.. వాటినే అమ్ముతూ దొరుకుతున్నారని, వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టాల్సి వస్తోందని, కానీ వాళ్లని మార్చాలంటే వాళ్లందరికీ ఓరియంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల (AMVI) నియామకపత్రాల జారీ సభలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంకొంతమంది దీపావళి పండుగకు మద్యంతో సంబరాలు చేసుకుంటున్నారని, డ్రగ్స్ దొరికినా.. మమ్మల్ని పట్టుకోవద్దని దబాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్.. ‘‘వీళ్లా మనకు ఆదర్శం..? ఇలాంటి వారిని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రానికి గోవా నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న డ్రగ్స్‌ని అడ్డుకోవడంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లది కీలక పాత్ర. ఆ విషయంలో మీరంతా అద్భుతంగా పని చేయాలి. మత్తు పదార్థాలతో తెలంగాణ సరిహద్దుల్లో అడుగుపెట్టాలంటే వాళ్ల వెన్నులో వణుకుపుట్టాలి. ఇది మన కమిట్మెంట్. ఇదే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ’’ అంటూ రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. 


Similar News