CM Revanth Reddy : హైదరాబాద్ ను టోక్యో, సింగపూర్ సరసన చేరుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో(Triumph of public governance) మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు.
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో(Triumph of public governance) మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. హైదరాబాద్(Hyderabad) లోని ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఏరాప్టు చేసిన వేదిక మీదుగా నగరంలోని పలు సుందరీకరణ పనులకు వర్చ్యువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2023 డిసెంబర్ 3 కు ఓ ప్రత్యేకత ఉందని, నాలుగు కోట్ల ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు ఇదని గుర్తు చేశారు. ప్రజల తీర్పుకు ఏడాది పాలన పూర్తయిందని.. ఈ పాలన విజయాలను పండగలాగ జరుపుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉందని, ప్రపంచంలోని అన్ని దేశాల్లోని అగ్ర ఐటీ కంపెనీల్లో ఈ నగర వాసులు ముఖ్య పాత్ర వహిస్తుంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే బేగంపేట్ లో డోమెస్టిక్ ఉన్న ఎయిర్పోర్టు మాత్రమే కాకుండా శంషాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్టు నిర్మించి, ఇంటర్నేషన్ ఫ్లైట్స్ నగరానికి వచ్చేలా చేశారన్నారు. మెట్రో ప్రాజెక్టు వలన ఈ నగరం దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల సరసన చేర్చింది కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. మా ముందు తరం కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృధ్ధికి మరింత అభివృద్ధిని ఇపుడు మేము జోడిస్తున్నామన్నారు.
రీజనల్ రింగ్ రోడ్డుకు 35 వేల కోట్లతో నిర్మిస్తున్నామని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు వేసి, గ్రామాలలో భూముల విలువ పెంచుతున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నం వద్ద ఆర్గానిక్ పంటల నిలువ కోసం అంతర్జాతీయ మార్కెట్ ను, కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ముచ్చెర్లలో 40 నుంచి 50 వేల ఎకరాల్లో టోక్యో, సింగపూర్, న్యూయార్క్ లాంటి అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. టాంక్ బండ్ ను కొబ్బరి నీళ్ళ లాగ స్వచ్ఛమైన నీరు చేస్తామని, వరంగల్ ను లండన్, కరీంనగర్ ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ సిటీ చేస్తామని గత పాలకులు గొప్పగా ప్రకటించారు కాని అక్కడ విపరీతమైన ట్రాఫిక్, వర్షాల వలన వరదల్లో ఆ నగరాలు మునిగిపోతున్నాయని అన్నారు. ఢిల్లీ కాలుష్యం, ముంబయి, చెన్నై లాగ వరదలు, బెంగుళూర్ లాంటి ట్రాఫిక్, కలకత్తా వంటి మురికి మనకు వద్దు అన్నారు. అలాంటి అధ్వానస్థితికి మన హైదరాబాద్ ను చేరకుండా హైదరాబాద్ ను రక్షించేందుకు రూ.7 వేల కోట్లతో పనులు చేపట్టామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని చెరువులను, కుంటలను రక్షించేందుకు హైడ్రా కమిషన్ ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పుడు ఆ భూములను కబ్జా చేయాలనుకునే వారికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నామని తెలిపారు.
కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేసి నాటకాలు ఆడటం కాదని, మూసీని మంచినీటి నదిగా మార్చడానికి, మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు, రీజనల్ రింగ్ రోడ్డుకు మోడీ నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఎన్ని నిధులు తీసుకు వస్తావో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మూసీ ప్రక్షాళనకు, మీ నియోజక వర్గానికి మీ వద్ద ఏం ప్రణాళికలు ఉన్నాయని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. అక్కడి ప్రజలు ఆ మురికిలోనే బతకాలని వారు కోరుకుంటున్నారు. రూ.లక్షన్నర కోట్లతో హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా మార్చడానికి మేము ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రకటించారు.