హైదరాబాద్ నగరంలో జరిమానాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) విషయంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-07-12 13:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) నగర అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణలో బలమైన వ్యవస్థగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో హైడ్రాపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితోపాటు సంబంధింత ఉన్నతాధికారులు హాజరయ్యారు. నగరంలోని 2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన నిబంధనలు..

హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల తొలగింపు బాధ్యత హైడ్రాకు బదలాయించాలని, జోన్ల విభజనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. నాళాలు, చెరువులు ఆక్రమణలపై కఠిన నిబంధనలతోపాటు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన నిబంధనలు రూపొందించాలన్నారు. హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించడంతోపాటు అసెంబ్లీ సమావేశాల్లోగా ఈ వ్యవస్థకు సంబంధించిన విధివిధానాల డ్రాప్ట్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News