‘నేనే మీ దగ్గరికి వాళ్లను పంపిస్తా’.. హరీశ్ రావుకు సీఎం రేవంత్ మరో సవాల్

బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. వరదల నేపథ్యంలో ప్రస్తుతం సీఎం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.

Update: 2024-09-03 10:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. వరదల నేపథ్యంలో ప్రస్తుతం సీఎం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేపట్టిన అక్రమ నిర్మాణాలు తొలగించడానికి సహకరించాలని అన్నారు. ‘నేనే మీ దగ్గరికి అధికారులను పంపిస్తాను. గతంలో మీరే ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. నా సవాల్‌కు సమాధానం చెప్పిన తర్వాతే.. మా చిత్తశుద్ధిని ప్రశ్నించాలి’ అని హరీష్ రావుకు సీఎం రేవంత్ సవాల్ చేశారు. ఖమ్మంలో ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని తెలిపారు. మున్నేరు రిటైనింగ్​వాల్​ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని అన్నారు.

సర్వే ఆఫ్​ఇండియా మ్యాప్స్​ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షం పడిందని చెప్పారు. ప్రభుత్వ ముందు చూపు వల్లే ప్రాణనష్టం తగ్గిందని అన్నారు. వరదలపై హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలంతా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. ముందు వాళ్లంగా బీఆర్ఎస్ నేత పువ్వాడ ఆక్రమణలపై స్పందించాలని కోరారు. ఆక్రమించిన స్థలంలోనే పువ్వాడ ఆసుపత్రి కట్టారని అన్నారు. ఆక్రమణల తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Similar News