Secretariat: 300 గజాల స్థలం, రూ.కోటి నగదు ఇస్తాం.. CM రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ కవులు, కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీపి కబురు అందించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కవులు, కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీపి కబురు అందించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం(Secretariat)లో ఏర్పాటు తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఒక వ్యక్తి కోసమో.. ఒక కుటుంబం కోసమో తెలంగాణ తెచ్చుకోలేదని అన్నారు. ఉద్యమాన్ని కవులు, కళాకారులు భుజాన వేసుకొని నడిపించారని కొనియాడారు. తమ ఆట పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని అన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని కళ్లకు కట్టినట్లు స్థూపం రూపొందించిన ఎక్కా యాదగిరి(Ekka Yadagiri)ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఫోర్త్ సిటీ(Fourth City)లో ఎక్కా యాదగిరికి 300 గజాల స్థలంతో పాటు రూ.కోటి నగదు అందజేస్తామని కీలక ప్రకటన చేశారు. ఆయనతో పాటు ప్రముఖ కవులు.. గూడ అంజయ్య, గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ సహా మొత్తం తొమ్మిది మంది కవులకు, కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, కోటి రూపాయల నగదు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.