CM Revanth Reddy : జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్
మేము అధికారంలోకి రాగానే మొదటి విడత జర్నలిస్టుల ఇళ్ళ పట్టాలు( journalists' houses)పంపిణీ చేశామని రెండో విడత కూడా ఇస్తామని, అందుకు మీరు సహకరించాలని, రెండోసారి అధికారంలోకి రాగానే అవి కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : మేము అధికారంలోకి రాగానే మొదటి విడత జర్నలిస్టుల ఇళ్ళ పట్టాలు( journalists' houses)పంపిణీ చేశామని రెండో విడత కూడా ఇస్తామని, అందుకు మీరు సహకరించాలని, రెండోసారి అధికారంలోకి రాగానే అవి కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయ ఆవరణలో కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం కొట్లాడారని, అయినా పెండింగ్ సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. మేము అధికారంలోకి రాగానే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలను క్లియర్ చేశామని పేర్కొన్నారు. మీకు కూడా సోషల్ రెస్పాన్స్ బులిటీ ఉండాలన్నారు.
రెండో విడత ఇండ్లను తాము రెండోసారి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. మీరు నాకు సహకరించాలని కోరారు. జర్నలిస్టులంతా(journalists) సామాజిక బాధ్యత నెరవేర్చాలని కోరారు. దీంతో ఫ్యూచర్ సిటీలో ఇండ్లపై ఆశలు పెట్టుకున్న జర్నలిస్టుల ఆశలపై తాత్కాలికంగా నీళ్ళు చల్లినట్లయ్యింది. మరికొన్నేళ్ళు వారికి ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూపులు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో కుండ బద్ధలు కొట్టారు.