CM Revanth Reddy : ఎస్ఎల్బీసీ టన్నెల్ లోకి సీఎం రేవంత్ రెడ్డి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident) గురించి తెలిసిందే.

Update: 2025-03-02 13:04 GMT
CM Revanth Reddy : ఎస్ఎల్బీసీ టన్నెల్ లోకి సీఎం రేవంత్ రెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident) గురించి తెలిసిందే. కాగా ఈ టన్నెల్ ప్రమాదస్థలానికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేరుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy), జూపల్లి కృష్ణారావు(Jupalli KrishnaRao)తో కలిసి సీఎం టన్నెల్ లోపలికి వెళ్లారు. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన 8 మంది సిబ్బంది మృతదేహాలను బయటికి తెచ్చేందుకు జరుగుతున్న సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, పరిస్థితులను, రెస్క్యూ ఆపరేషన్(SLBC Rescue Operation) ను మంత్రులు సీఎంకు వివరించారు.

అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఫిబ్రవరి 22న ఒక్కసారిగా సొరంగంలో కొంతభాగం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు సొరంగ నిర్మాణ కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు కుప్పకూలిన శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ, నేవీ బృందాలు, సింగరేణి రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలించాయి. ఎట్టకేలకు 10 రోజుల తర్వాత వారు ప్రమాదంలో మరణించినట్టు అత్యాధునిక రాడార్ల ద్వారా రెస్క్యూ బృందాలు గుర్తించాయి. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News