స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల డిజైన్స్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల డిజైన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

Update: 2024-08-30 15:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల డిజైన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం సచివాలయంలో.. డిజైన్లను పరిశీలించి వాటిలో కొన్ని కీలక మార్పులను సీఎం సూచించినట్టు సమాచారం. త్వరగా డిజైన్లు పూర్తి చేసి ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా గ్రాడ్యూయేట్ యువతకు పరిశ్రమలకు, కంపెనీలకు అవసరమైన నాణ్యమైన స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటును ప్రభుత్వం తలపెట్టింది. ఇక రూ.5000 కోట్లతో విద్యార్థులు ఎల్కేజీ నుండి పీజీ వరకు పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తీసుకు రానుంది.


Similar News