పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం: రేవంత్ రెడ్డి
పారిశ్రామిక రంగంలో మహిళలను మరింత ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: పారిశ్రామిక రంగంలో మహిళలను మరింత ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అఖిల నుమాయిష్ ఎగ్బిబిషన్‌ను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో విద్యా సంస్థలకు అండగా ఉంటామన్నారు.
నుమాయిష్‌లో పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నుమాయిష్‌లో పాల్గొనే వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా ఇవాళ్టి నుంచి ప్రారంభమైన నుమాయిష్ ఎగ్బిబిషన్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ పారిశ్రామిక ప్రదర్శన కోసం దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేశారు.