తెలంగాణ వాసులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. మరో వారం రోజుల్లో ఆ రెండు స్కీములు అమలు

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్‌లపై కీలక

Update: 2024-02-21 15:18 GMT

దిశ, వెబ్‌డెస్క్/ మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్‌లపై కీలక ప్రకటన చేశారు. మరో వారం రోజుల్లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం రేవంత్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మరో వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్, ప్రతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. వచ్చేనెల 15లోపు రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేశామన్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Tags:    

Similar News