CM Revanth Reddy: ఏఎంవీఐలకు నియామకపత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-11-11 08:56 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: 99 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల (AMVI)కు సీఎం రేవంత్ రెడ్డి నేడు (సోమవారం) నియామకపత్రాలు అందజేశారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో సీఎం అభ్యర్థులకు ఈ పత్రాలను అందజేశారు. ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు జాయినింగ్ లెటర్స్ ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియామకాలు చేపట్టామని, న్యాయవివాదాలకు పరిష్కరించి నియామకాలపై దృష్టిసారించామని అన్నారు. గత పాలకులు సొంత వాళ్ల ఉద్యోగాల గురించే ఆలోచించారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 సహా అన్ని స్థాయిల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. నిరుద్యోగుల పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని, వారి ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. 


Similar News