CM Revanth Reddy: నిత్య జనగణమన సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని నిత్య జనగణమన సెంటర్‌లో ప్రోగ్రాం నిర్వహించారు. వందే ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్లకుంటలోని నిత్య జనగణమన వేదికపై జన్మదిన వేడుకలు చేపట్టారు.

Update: 2024-11-08 16:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని నిత్య జనగణమన సెంటర్‌లో ప్రోగ్రాం నిర్వహించారు. వందే ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్లకుంటలోని నిత్య జనగణమన వేదికపై జన్మదిన వేడుకలు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ, కేక్ కటింగ్, రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబర్‌పేట నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెపి మురళీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టిపిసిసి కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ ఆయన సతీమణి ఉషశ్రీ దంపతులు, రేవంత్ రెడ్డి 55వ పుట్టినరోజుకు గుర్తుగా ఐదున్నర కేజీల కేక్ కట్ చేసి జన్మదినోత్సవాలను ప్రారంభించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సత్వర అభివృద్ధి కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఆ తర్వాత జర్నలిస్టులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శ్రీకాంత్ గౌడ్ దంపతులతో పాటు కార్యక్రమానికి హాజరైన ఖైరతాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి తొలుపు నూరి కృష్ణ గౌడ్, నల్లకుంట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిహెచ్ మురళీకృష్ణ, గోల్నాక కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ్మోహన్, కత్తుల సుదర్శన్, తదితరులను నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. వందే ప్రజా సంస్థకు చెందిన ఎన్. మధు, ఏంకే శ్రీనివాస్, ఉపేంద్ర ప్రసాద్ దుబె, డిఎన్ రావు, భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News