ఎవరు అడ్డుపడ్డ మూసీ ప్రక్షాళన ఆగదు.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం పొందిన1473 మందికి ఉద్యోగ నియామకపత్రాలు సీఎం రేవంత్‌ రెడ్డి అంందించారు.

Update: 2024-10-06 12:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం పొందిన1473 మందికి ఉద్యోగ నియామకపత్రాలు సీఎం రేవంత్‌(CM Revanth) రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను పట్టించుకోలేదని ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షించి, గత ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, ఉద్యోగుల కళ్ళలో సంతోషం చూడాలనే దసరా కంటే ముందే నియామక పత్రాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే నగరంలో సంచలనం గా మారిన హైడ్రా, మూసీ ప్రక్షాళన పై సీఎం మాట్లాడుతూ.. హాట్ కామెంట్స్ చేశారు. ఎవరు అడ్డుపడ్డ మూసీ ప్రక్షాళన ఆగదంటు ఫైర్ అయ్యారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని, మూసీ ప్రాంత పేదల జీవితాలు బాగుపడొద్దా అని ఆయన ప్రశ్నించారు. మూసీ ప్రాంతంలో 10 వేల కుటుంబాలు ఉన్నాయి. మూసీ ప్రక్షాళన కోసం.. మరో 10 వేల కోట్లు ఖర్చు చేసి.. మూసీ బాధితులను ఆదుకోలేమా అంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.


Similar News