హోటల్ నిర్వాహకులకు CM రేవంత్ గుడ్ న్యూస్
హైదరాబాద్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ రాత్రి ఒంటిగంట దాటినా రోడ్లపైన తిరిగే జనాల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ రాత్రి ఒంటిగంట దాటినా రోడ్లపైన తిరిగే జనాల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదు. ముఖ్యంగా రాత్రి సమయంలో యువత ఎక్కువగా విహరిస్తుంటారు. ఈ క్రమంలోనే హోటళ్లు, రెస్టారెంట్లు ఆ సమయం వరకు పర్మిషన్ లేకున్నా.. యువత వస్తారనే నమ్మకంతో భయం భయంగా రాత్రుళ్లు సైతం నిర్వహిస్తుంటారు. తాజాగా హోటల్ నిర్వాహకులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం షాపులు తప్ప మిగతా అన్ని దుకాణాలు, ఏ వ్యాపారమైనా నడిపించుకోవచ్చని తెలిపారు. వైన్ షాపులకు ఈ అవకాశం ఇస్తే విచ్చలవిడిగా తాగి రోడ్లపై రచ్చ చేసే అవకాశం ఉందని.. అందుకే దాన్ని మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, రాత్రి 11 గంటలకే రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో ఇబ్బంది అవుతోందని పలువురు సీఎం రేవంత్ దృష్టికి తీసుకురావడంతో ఈ ప్రకటన చేశారు.