CM Overseas Scholarship: మైనారిటీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సీఎం విదేశీ విద్య పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
తెలంగాణ ప్రభుత్వం(TG Govt) మైనారిటీ విద్యార్థుల(Minority Students)కు గుడ్‌న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(TG Govt) మైనారిటీ విద్యార్థుల(Minority Students)కు గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎం విదేశీ విద్య పథకం కింద ఫాల్ సీజన్(Fall Season) కోసం మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in/లో డిసెంబర్ 1 నుంచి 31 వరకు అప్లై చేసుకోవాలని మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్ యాస్మీన్ బాషా(Yasmeen Basha) తెలిపారు. యునైటెడ్ స్టేట్స్, యూకే , ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ కోర్సులు అభ్యసిస్తున్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులకు రూ. 20 లక్షల స్కాలర్షిప్(Scholarship)తో పాటు ఫ్లైట్ టికెట్ ఛార్జీలు(Flight Ticket Charges) అందజేస్తారు.
అర్హత:
ఈ స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించాలంటే డిగ్రీ/బీటెక్(Degree/B.Tech) లో 60 శాతం స్కోర్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (GRE) లేదా గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GMAT), ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్(English Language Test)లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ మంజూరు చేస్తారు. అప్లై చేసే విద్యార్ధి కుటుంబ వార్షిక ఆదాయం(Annual Income) రూ. 5 లక్షల లోపు ఉండాలి.