సీఎం కేసీఆర్ వాహనంలో మరోసారి ముమ్మరంగా తనిఖీలు

గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు ఇవాళ మరోసారి తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా

Update: 2023-11-20 06:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు ఇవాళ మరోసారి తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం హాజరవనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి ప్రగతి రథం బస్సు వెళ్తున్న సమయంలో కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్‌గేట్‌ వద్ద కేంద్ర బలగాలు తనిఖీలు నిర్వహించాయి. బస్సును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి బలగాలకు సిబ్బంది పూర్తిగా సహకరించారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న సభలకు హాజరవనున్నారు.

Tags:    

Similar News