రూ. 6 వేలకు పెన్షన్ పెంపు.. BRS మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించిన సీఎం కేసీఆర్..!
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల యుద్ధాన్ని ప్రారంభించిన
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల యుద్ధాన్ని ప్రారంభించిన కేసీఆర్.. తాజాగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్‌కు దీటుగా కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను రూపొందించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేశారు. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోలో కేసీఆర్ హామీల వర్షం కురిపించారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాలు ఇవే..
పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్
హైదరాబాదులో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
అనాథ బాలల కోసం పటిష్టమైన అర్బన్ పాలసీ
అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేత
రూ.5 లక్షలతో బీమా సౌకర్యం... ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాట్లు
సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం...93 లక్షల కుటుంబాలకు లబ్ది
అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్
జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు
ఆరోగ్యశ్రీ బీమా మొత్తం రూ.15 లక్షలకు పెంపు
దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు
సాధారణ మరణానికి కూడా కేసీఆర్ బీమా వర్తింపు
తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం... 'తెలంగాణ అన్నపూర్ణ' పథకం ద్వారా సన్నబియ్యం సరఫరా
ఆసరా పింఛన్ల మొత్తం దశలవారీగా పెంపు
పింఛన్లు ఏడాదికి రూ.500 చొప్పున రూ.5 వేల వరకు పెంపు
రైతు బంధు మొత్తం దశలవారీగా రూ.16 వేల వరకు పెంపు... ముందుగా రూ.12 వేలకు పెంపు