అధికారమే లక్ష్యంగా BRS ప్లాన్.. రంగంలోకి పోలీసు యంత్రాంగం!
రాష్ర్టంలో సాధారణ ఎన్నికలకు మరో ఆరునెలలు మాత్రమే మిగిలి ఉండగా.. రాజకీయ వాతావరణం హీటెక్కింది. హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రాష్ర్టంలో సాధారణ ఎన్నికలకు మరో ఆరునెలలు మాత్రమే మిగిలి ఉండగా.. రాజకీయ వాతావరణం హీటెక్కింది. హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. అధికారపార్టీని అడ్డుకొని పవర్ లోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అధికార పార్టీనేమో అమలు చేసే సంక్షేమ పథకాలను చెప్పుకుంటుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఏ చిన్న చాన్స్ దొరికినా సర్కార్ తీరుపై విరుచుకుపడుతూ విమర్శలు గుప్పిస్తున్నాయి. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలకు దిగుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా... టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ ను పేర్కొనవచ్చు. దీన్ని ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వ వైఫల్యంగా ఎత్తి చూపుతూ అధికార పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీలోనే విభేదాలు బయటపడుతుండడంతో కొందరు నేతలు వేరే పార్టీలోకి జంప్ అయ్యే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జోరుగా నడుస్తుండగా బీఆర్ఎస్ అలర్టైంది. ప్రతిపక్షాల వ్యూహాలపైనే కన్నేసింది. ఆయా పార్టీల ముఖ్య నేతల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. మున్ముందు ప్రతిపక్షాల ఎత్తుగడలు ఎలా ఉండనున్నాయనే దానిపైనా సమాచారం సేకరిస్తున్నది. మరోవైపు సొంత పార్టీలో అసంతృప్తి నేతలపైనా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఏయే అంశాలపై దృష్టి పెట్టాలనే దానిపై ప్రభుత్వం పోలీస్బాస్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా.. రంగంలోకి దింపినట్టుగా తెలిసింది.
ఎప్పటికప్పడు ముందస్తుగా..
‘‘ఎన్నికల ఏడాది. మరింత అలర్ట్‌గా ఉండాలి. పార్టీలు పాదయాత్రలు, సభలు, సమావేశాలు, బహిరంగ సభలను ముమ్మరం చేస్తాయి. కట్టుదిట్టమైన నిఘా పెట్టాలి. దీంట్లో స్పెషల్‌బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌లోని పొలిటికల్వింగ్సిబ్బందిదే కీలకపాత్ర’’ అంటూ.. అంబేద్కర్ జయంతి.. విగ్రహావిష్కరణ నేపథ్యంలో కమిషనర్లు, ఎస్పీలతో సమావేశమైన సందర్భంగా డీజీపీ అంజనీకుమార్చెసిన వ్యాఖ్యలివి. ఎప్పటికప్పడు ముందస్తుగా ఆయా పార్టీల ప్రోగ్రామ్స్ వివరాలను సేకరించి.. తద్వారా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన సమాచారం నిఘా విభాగాలు అందజేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ప్రతి గ్రామానికి పోలీసులు వెళ్లాలని.. ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్థానికంగా శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీయాలని పేర్కొన్నారు. ఎన్నికల నాటికి ఏవైనా అల్లర్లు తలెత్తే అవకాశాలున్నాయా ? అనే కోణంలో కూడా దృష్టిని సారించాలని.. అప్పుడే శాంతిభద్రతలను కాపాడగలమని వివరించారు. అయితే, పైకి శాంతి భద్రతలపై అని చెబుతున్నప్పటికీ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలపైనే నిఘా పెట్టటానికే పోలీస్బాస్పలు సూచనలు చేసిన్టటు తెలుస్తుంది. ‘‘ మీకు తెలియంది ఏముంది? ఎన్నికల ఏడాదిలో అధికారంలో ఉన్న పార్టీ అయినా ఇదంతా చేయటం మామూలే కదా..! ఓ సీనియర్పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. జనవరిలో జరిగిన 127 మంది ఐపీఎస్‌ల బదిలీలు ఇందులో భాగమే అని గుర్తుచేశారు. ప్రతి పక్షాల యాక్టివిటీస్ , నేతల కదలికలపై ఎప్పటికప్పడు ఆరా తీయటంతోపాటు అధికార పార్టీలోని అసమ్మతివాదులు, టిక్కెట్ల ఆశావహులు, రాకపోతే వాళ్ల వ్యూహాలు.. ఇలా పలు అంశాలకు సంబంధించి కూడా సమాచార సేకరణ ఉంటుందని వివరించారు. సేకరించిన వివరాలన్నీ ప్రతిరోజూ ప్రభుత్వ పెద్దలకు చేరుతాయని పేర్కొన్నారు. ఆరు నెలలే ఉండగా పోలీసు సిబ్బందిలోనూ పని వేగం పెరిగిందని వెల్లడించారు.
ఇన్ఫార్మర్ నెట్ వర్క్ యాక్టివ్
ఓ వైపు పోలీసుశాఖలోని స్పెషల్‌బ్రాంచ్, ఇంటెలిజెన్స్వింగ్ లను రంగంలోకి దింపడంతో పాటు ప్రైవేట్ఇన్ఫార్మర్నెట్వర్క్ను కూడా పోలీసు అధికారులు యాక్టివ్చేసినట్టుగా తెలిసింది. సాధారణంగా స్టేషన్స్థాయిలో పనిచేసే ప్రతి సీఐ, ఎస్ఐలకు సొంతంగా ఇన్ఫార్మర్లు ఉంటారు. ఆయా స్టేషన్ల పరిధిలో జరిగే నేరాలపై వీళ్లు కీలకమైన వివరాలను అందిస్తుంటారు. కేసు స్థాయిని బట్టి అధికారులు వీరికి బక్షీస్ఇస్తుంటారు. కొంతమంది అధికారులైతే నెలకు ఇంత అని డబ్బు ముట్టచెబుతూ.. ఇన్ఫార్మర్లను కేసుల పరిష్కారానికి వాడుకుంటారు. సీక్రెట్ సమాచారం సేకరించటంలో దిట్టలైన ప్రయివేట్ఇన్ఫార్మర్లకు కూడా ప్రస్తుతం ఎన్నికల బాధ్యతలు అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం. స్పెషల్‌బ్రాంచ్, ఇంటెలిజెన్స్సిబ్బంది సివిల్‌లో ఉన్నా ఆయాపార్టీల నేతలు, కార్యకర్తలు గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయని చెబుతున్న కొందరు పోలీసు అధికారులు చూడటానికి కాలేజీ విద్యార్థుల్లా.. ప్రయివేట్ఉద్యోగుల్లా కనిపించే వీరిని ఎంతమాత్రం గుర్తుపట్టలేరు. దీంతో ఇన్ఫార్మర్లను ఆయా పార్టీల ఆఫీసులు, బడా నేతల ఇండ్ల వద్ద రంగంలోకి దింపినట్టు సమాచారం. గెలుపే లక్ష్యంగా పోలీసు యంత్రాంగాన్ని మంత్రాంగంలోకి దింపిన ప్రభుత్వానికి ఏ మేర ఫలితాలు వస్తాయన్నది వేచి చూడాల్సిందే.!
Read more:
‘ఫ్రంట్’లో ముందుకు పడని కేసీఆర్ అడుగులు.. సైలెంట్‌గా పార్టీ వ్యవహారాలపైనే ఫోకస్!