కవితకు ఈడీ నోటీసులపై మొదటిసారి స్పందించిన కేసీఆర్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై సీఎం కేసీఆర్ మొదటిసారి స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీల వరకు దర్యాప్తు సంస్థలు వచ్చాయని ఇప్పుడు తన బిడ్డ వరకు వచ్చారన్నారు. రేపు కవితను అరెస్ట్ చేసినా చేయవచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో భయపడేది లేదని పోరాటం వదిలేది లేదన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన పార్టీ మీటింగ్‌లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్.. ఎంత మంచి పని చేసినా బద్నాం చేసేవాళ్లు ఉంటారని అందువల్ల అందరూ జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. కవితకు నోటీసులు ఇచ్చారు. ఏం చేస్తారో చూద్దాం అన్నారు. ఈ అంశాన్ని ప్రజాస్వామ్య, న్యాయబద్ధంగా ఎదుర్కొందామని పార్టీ నేతలతో అన్నారు. బీజేపీని ఇంటికి పంపించడంలో బీఆర్ఎస్ మరింత కీలక పాత్ర పోషించాలని అందరూ ప్రజల కోసం కడుపు కట్టుకుని పని చేయాలని సూచించారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయగా.. కవిత కొంత సమయం కోరారు. ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున ఈ నెల 15న విచారణకు వస్తానని ఈడీకి లేఖ రాశారు. కానీ ఈ నెల 11న విచారణకు రావాలని ఈడీ కోరడంతో.. ఆ రోజు విచారణకు కవిత హాజరుకానున్నారు. శనివారం కవిత ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాలతో పాటు తెలంగాణ పాలిటిక్స్‌లో నెలకొంది.
Read more: