వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన CM.KCR

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా

Update: 2023-10-20 11:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని, 95 నుండి 105 సీట్లు వస్తాయని అన్నారు. తాను కామారెడ్డిలో పోటీ చేయడానికి ఒక కారణం ఉందన్నారు. శుక్రవారం మేడ్చల్‌లోని తూంకుంటలోని కన్వెన్షన్ హాల్‌లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే టర్మ్‌లో నెలకు ఒక్కపూట గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంటానని, మీతోనే గడుపుతానని శ్రేణులకు హామీ ఇచ్చారు. గజ్వేల్‌కు కావాల్సింది చాలా ఉందని, లీడర్లు ఇదే చాలు అని ఉరుకోవద్దని చెప్పారు. 

గజ్వేల్‌లో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నామని, మనం గెలవడం కాదని, పక్కన ఉన్న 3 నియోజకవర్గాలను గెలిపించాలని కోరుతున్నానని కేసీఆర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి అగవద్దు అంటే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని, ఖచ్చితంగా గెలుస్తుందని తెలిపారు. ఎన్నికల తరువాత ఒక్కరోజు మొత్తం గజ్వేల్ నియోజకవర్గ ప్రజలతో గడుపుతానని, అందరికీ అండగా ఉంటానని చెప్పారు. పదవులు వస్తాయి, పోతాయి.. ఉన్నప్పుడు ఏం చేశారు అనేది ముఖ్యమన్నారు. గజ్వేల్ బిడ్డలు తనను కడుపులో పెట్టుకొని గెలిపించారని, నియోజకవర్గానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు.

Tags:    

Similar News