మనీష్ సిసోడియా అరెస్ట్‌పై స్పందించిన సీఎం కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేశారని అన్నారు. మోడీ-అదానీకి ఉన్న అనుబంధం గురించి ఇప్పటికే ప్రజలకు క్లియర్‌గా తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కేంద్రం మానుకోవాలని సూచించారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన్ను సుమారు 8 గంటల పాటు విచారించిన సీబీఐ అనంతరం అదుపులోకి తీసుకున్నది. ఇవాళ(సోమవారం) కోర్టులో హాజరుపర్చగా.. సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. రేపటి నుంచి మార్చి 4 వరకు సీబీఐ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీఎం కేసీఆర్‌పై సుప్రీంకోర్టు సీరియస్