Minister Errabelli Dayakar Rao పై CM KCR సీరియస్!
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, వివాదాలు సృష్టించొద్దని హెచ్చరించినట్టు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, వివాదాలు సృష్టించొద్దని హెచ్చరించినట్టు సమాచారం. 25 మంది ఎమ్మెల్యేలపై ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని టాక్. మూడు రోజుల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబ్‌బాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండలస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్‌కు చెందిన 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాను వ్యక్తిగతంగా చేయించిన సర్వేల ఆధారంగానే ఈ విషయం చెబుతున్నట్టు వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో ఆ 25 మందిని మారిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్ పార్టీలో చర్చలకు దారితీశాయి. గతంలో సిట్టింగులందరికీ టికెట్స్ ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. మరి మంత్రి ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు? సీఎం కేసీఆర్ సూచనతోనే ఆయన అలా మాట్లాడారా? అని బీఆర్ఎస్ లీడర్లలో అనుమానాలు మొదలయ్యాయి. దీనిని గ్రహించిన కేసీఆర్.. మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, అత్యుత్సాహం వద్దని సీరియస్ అయినట్టు టాక్. పరిధి దాటి ప్రకటనలు చేయొద్దని సీఎం హెచ్చరించినట్టు సమాచారం. చివరకు తన మాటలను మీడియా వక్రీకరించిందని ఎర్రబెల్లి మాట మార్చినట్టు చర్చ జరుగుతున్నది.
Also Read...