KCR : అర్చకులకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్

అర్చకులకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2023-05-31 06:39 GMT

దిశ, శేరిలింగంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్థాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని.. సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్దుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్ పల్లిలో నూతనంగా నిర్మించిన బ్రాహ్మణ సంక్షేమ సదన్ ను, సీఎస్ శాంతకుమారి, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ బ్రాహ్మణ పరిషత్ ప్రతినిధులు, వివిధ పీఠాధిపతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

సర్వజనహితం, సర్వజన లక్ష్యం కోసమే బ్రాహ్మణులు పనిచేస్తారని అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సర్వజన సమాదరణ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. కులానికి పెద్దలైనా అందులోనూ చాలామంది పేదలు ఉన్నారని, వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తూ వారిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు సీఎం కేసీఆర్. బ్రాహ్మణ పరిషత్ ను ఏర్పాటు చేసి ఏడాదికి రూ. 100 కోట్లను కేటాయిస్తుందని, ఈ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

పేద బ్రాహ్మణులు పెట్టుబడుల కోసం రూ. 150 కోట్లు కేటాయించిందని తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమంలో భాగంగా గోపన్ పల్లిలో 9 ఎకరాల స్థలంలో, రూ.12 కోట్లతో బ్రాహ్మణ సంక్షేమ సదన్ ను ఏర్పాటు చేశామని, ఇది సనాతన సంస్కృతి కేంద్రంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ సదన్ ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కేంద్రంగా నిలుస్తుందని, దేశంలోని ఆయా ప్రాంతాల నుండి తెలంగాణకు వచ్చే పీఠాధిపతులు, ధర్మాచార్యులు విడిది కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బ్రాహ్మణులపై పలు వరాలు కురిపించారు.

దూపదీప నైవేద్యాలకు ఇచ్చే నిధులు రూ. 6 వేల నుండి రూ.10 వేలకు పెంచుతున్నామని, అలాగే అర్చకులకు ఇచ్చే భృతి వయస్సు 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గిస్తున్నామని, అర్చకులకు ఇస్తున్న భృతి రూ.2500 నుండి రూ.5000 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గత ఆరేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలును పరిషత్ అధ్యక్షులు కేవీ రమణాచారి వివరించారు. సంక్షేమ పరిషత్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 6500 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు.

Read more:

బీఆర్ఎస్‌లో వర్గ పోరు

Tags:    

Similar News