యాదాద్రి థర్మల్ ప్లాంట్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
నల్లగొండ జిల్లా దామరచర్లలో పర్యటించిన సీఎం కేసీఆర్ యాదాద్రి థర్మర్ పవర్ ప్లాంట్ పనులను సోమవారం పరిశీలించారు.
దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా దామరచర్లలో పర్యటించిన సీఎం కేసీఆర్ యాదాద్రి థర్మర్ పవర్ ప్లాంట్ పనులను సోమవారం పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణ పనులు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. సీఎం వెంట శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా 62 శాతం పనులు పూర్తయిన ఈ ప్లాంట్ వచ్చే ఏడాది నాటికి అందుబాటులో తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఒకే స్థలంలో 4వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కల ఈ ప్రాజెక్టు రూ.2,992 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తు్న్నారు.