బండా ప్రకాశ్‌ను సీటులో కూర్చోబెట్టిన సీఎం కేసీఆర్

శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ఏకగ్రీవమయ్యారు.

Update: 2023-02-12 16:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్ ఏకగ్రీవమయ్యారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు ఖావడంతో ఏకగ్రీవం అయ్యారు. ఆదివారం మండలిలో బండా ప్రకాశ్ డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. సీఎం కేసీఆర్ దగ్గరుండి ఆయను కుర్చిలో కూర్చోబెట్టి అభినందించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ బాధ్యతలు తీసుకోవటం సంతోషకరమన్నారు. విద్యార్థి దశ నుంచి కష్టపడి నాయకుడిగా ఎదిగారన్నారు. ఉన్నత విద్యావంతుడిగా వరంగల్ జిల్లా వాసిగా సుపరిచితుడన్నారు.

ముదిరాజ్ సామాజిక అభ్యన్నతికి బండ ప్రకాష్ చేసిన కృషి అభినందనీయమని, ముదిరాజ్ సంక్షేమం భవనం‌ కోసం బండ ప్రకాష్ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా ప్రకాష్ కీలకపాత్ర పోషించారన్నారు. నూతన రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమైనదని, డిప్యూటీ చైర్మెన్‌గా శాసనమండలిని సమర్థమతంగా నడిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.

ఎమ్మెల్సీలకు సన్మానం...

ఈ ఏడాది మార్చి, మే నెలలో పదవి ముగియనున్న ఎమ్మెల్సీలు వుల్లోల గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, నవీన్ కుమార్ కుర్మయ్యగారి, సయ్యద్ అమిన్ ఉల్ హసన్ జాఫ్రీ, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, డి.రాజేశ్వర్ రావు, ఫరూక్ హుస్సేన్‌ను తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు,వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ తదితరులున్నారు.

Tags:    

Similar News