ఆ ఎమ్మెల్యేలకు ఇదే లాస్ట్ వార్నింగ్.. మళ్లీ రిపీటైతే..: సీఎం కేసీఆర్ సీరియస్
దళితబంధు స్కీమ్‌పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌లో కేసీఆర్ దళిత
దిశ, వెబ్‌డెస్క్: దళితబంధు స్కీమ్‌పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌లో కేసీఆర్ దళిత బంధుపై మాట్లాడుతూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పంపిణీలో కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూల్ చేశారని.. ఆ ఎమ్మెల్యేల చిట్టా అంతా నా దగ్గర ఉందని హెచ్చరించారు.
దళిత బంధు స్కీమ్‌లో వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెలేలకు ఇదే చివరి వార్నింగ్ అని.. మళ్లీ వసూళ్లకు పాల్పడితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని.. దానితో పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మీ అనుచరులు దళిత బంధు స్కీ్మ్ తీసుకున్నా మీదే బాధ్యత అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఈ సందర్భంగా సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ వసూళ్ల చిట్టా తన దగ్గర ఉందని చెప్పడంతో దళిత బంధు స్కీమ్‌లో వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది.